చేతిరాత-తలరాత

అసలు ఈ రెంటికీ సంబంధం ఏమైనా ఉందా-ఓసారి లుక్కేద్దామా!

చూసిరాతతో మన చేతిరాత మెరుగయినట్టు-మన తలరాతను కూడా మార్చు కోవచ్చు-అప్పటి నానుడి!

చేతిరాత బాగాలేకపోతే పైకి రాలేమని (పైకి లేవలేమని కాదు) మన చిన్నతనంలో టీచర్లు విపరీతంగా పలకలమీద, పుస్తకాలమీద అభ్యాసం చేయించేవారు; ఓహోకాబోలు అనుకోని కాపీ రైటింగ్ బుక్కులలో ప్రాక్టీస్.టన్నుల కొద్దీ , బలపాలు, పలకలు, పుస్తకాలు,పెన్సిళ్లు,పెన్నులు అరిగికరిగి పోయేట్టు అభ్యాసం చేసేవాళ్ళం.

ఇంట్లోవాళ్ళని ఏడిపించేవాళ్ళం- కాపీ రైటింగ్ పుస్తకాలు కొనమని, మాఊళ్లో ఫాన్సీషాప్ వాడికి మాత్రం పండగే- చేతిరాత బాగుపడుతుందో లేదోగానీ వాడికి మాత్రం మంచి బేరం-పిల్లకాయల్తో.అప్పట్లో అనుమానం రాలేదు గాని- అమాయకత్వం వల్ల- ఈ స్టేషనరీషాప్ వాడే స్కూళ్లలో మాస్టార్లని కాకాబట్టి వాళ్ళని ఒప్పించి మనచేత ఇలా రాయించిఉంటారు- కొద్దిగా బుద్ధిపెరిగిన తర్వాత మాత్రం అనిపించింది.

అలా ఇరగదీసి రాసినందుకు కొంతమంది చేతిరాత ఖచ్చితంగా మెరుగయ్యే ఉంటుంది-కొంతమంది చేతిరాత ముత్యాల్లాగా అయిఉంటుంది!

ఏదో నాబోటివాళ్ళ విషయంలో మాత్రం కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అయిందే తప్ప, నా చేతిరాత చూసి మెచ్చుకునే లెవెల్లో మాత్రం కాలేదు - కాకపోతే నా తలరాత బాగుందిలెండి- అది వేరు విషయం.

ఆ కొద్ది ఇంప్రూవ్మెంట్ అవకుండాఉంటే, మిమ్మల్నిలా నారాతలతో విసిగించకుండా మీ మానాన మిమ్మల్ని ఒదిలేసి ఉండేవాణ్ణేమో- మీ జోలికి రాకుండా!

నా చేతిరాత అల్లాగే ఉండివుంటే ఎంచక్కా ఓ డాక్టర్ ని అయిఉండేవాణ్ణి- నారాత ఎవరికీ అర్ధంకాకుండా!

అంటే, మన చిన్నప్పటి చేతిరాతని మార్చుకోకుండా ఉంటే మన తలరాత బాగుంటుంది అనేగా ఇక్కడ నిరూపితం (Prove) అయింది-డాక్టర్లవల్ల!

అందువల్ల మీ పిల్లల చేతిరాత బాగోపోతే బెంగపడొద్దు, నిక్షేపంగా ఉండండి, వాళ్ళు పెద్దయినతర్వాత డాక్టర్లు అయి కూర్చుంటారు; ఇంట్లోవాళ్ళ ఒంట్లో రోగాలువస్తే కాణీ ఖర్చుఅవదు మరి. నేను ఎలాగూ మిస్ అయ్యాను ఆ ఛాన్స్-రోగాలు కాదు మిస్ అయింది- ఉచిత వైద్యసదుపాయం-మీరన్నామీపిల్లల్ని బాగుపడనివ్వండి- వారి చేతిరాత అలాగే ఉండనిచ్చి!

స్వానుభవంతో చెప్పా మీ ఇష్టం ఆ తర్వాత,ఉంటామరి. డాక్టర్ దగ్గరకి వెళ్ళాలి-వైద్యానికి కాదు- కబుర్లాడటానికి!

divider

Share your thoughts with Author!!

Spread the words out!!!